రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, వసతితో మూడు నెలల పాటుగా సీసీటీవీ ఇన్స్టాలైజేషన్, సాఫ్ట్ స్కిల్స్,బేసిక్ కంప్యూటర్ పై ఉచిత శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -
ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు 10 వ తరగతి సర్టిఫికేట్ తో, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఈనెల 18 వ తేది సాయంత్రంలోగా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ యువత ఇట్టి సువర్ణావకాషాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.