Wednesday, October 16, 2024
HomeతెలంగాణAsifabad: అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు

Asifabad: అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు

వాగులో నడిచిన మంత్రి..

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పునరుద్ఘాటించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి లు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్ హౌస్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం గుండి గ్రామంలో పదో తరగతి వరకు ఉన్నతీకరించిన పాఠశాలను ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. గుండి గ్రామానికి మధ్యలో అడ్డుగా ఉన్న పెద్దవాగుపై వంతెన సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. గుండి గ్రామం నుండి కనరగాం రహదారి కూడా పూర్తి చేస్తామన్నారు. అనంతరం తిరిగి వచ్చేటప్పుడు వాగులో నడుచుకుంటూ రావడంతో నాయకులు ఆమెను అనుసరించారు. అనంతరం జనకాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో చేపట్టిన మొబైల్ సైన్స్ లాబ్ ను ప్రారంభించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభించి మహిళ స్వశక్తి సంఘాలకు 18 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వము సబ్సిడీ రుణాలను అందిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆశిఫాబాద్ మండలంలోని ఆడ గ్రామంలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన టూరిజం భవనాన్ని ప్రారంభించడంతోపాటు అడా ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News