Monday, November 25, 2024
HomeఆటYadadri Bhuvanagiri: క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం

Yadadri Bhuvanagiri: క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం

సీఎం కప్ టార్చి ర్యాలీలో ..

యువత చెడు వ్యసనాలకు మత్తుపదార్థాలకు బానిస కాకుండా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కప్ టర్చ్ ర్యాలీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే ఘనంగా స్వాగతం పలికినారు. అనంతరం ఈ ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం నుండి భువనగిరి కోట వరకు నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ…
పల్లెల నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్ చక్కటి వేదిక అన్నారు.జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల వారి ప్రతిభను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే సీఎం కప్ ఉద్దేశమన్నారు.రాష్ట్రంలోని యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, క్రీడల వైపు మొగ్గు చూపాలి అనే ఉద్దేశంతో సిఎం కప్ ముఖ్య ఉదేశ్యం అని తెలిపారు.గ్రామీణ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ యువతలో క్రీడాకారులను వెలికి తీసి వారికి మంచి సౌకర్యాలు కల్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ క్రీడలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.


యువత క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండడమేకాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. విద్యార్థులు చదువులతో పాటు..క్రీడల్లో రాణించాలని అన్నారు..సీఎం కప్ పట్ల విస్తృతంగా చైతన్యం కలిగించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువమంది క్రీడాకారులు పాల్గొనేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమం స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి, జిల్లా పరిషత్ శోభారాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, కె. ధనంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ శ్యాంసుందర్, జిల్లా అధికారులు జైపాల్ రెడ్డి రమణి ఇతర అధికారులు ఉమెన్ అండ్ వెల్ఫేర్ అధికారులు హేమలత నికిత పుష్ప భార్గవి, పర్వతారోహిని అన్విత రెడ్డి వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు సీనియర్ క్రీడాకారులు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News