నేడు మల్డకల్ మండల కేంద్రములో శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి ఆలయం పునః విగ్రహప్రతిష్ఠామహోత్సవకార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహాలకు పూలమాల వేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు వాల్మీకి సోదరులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..వాల్మీకి ఆదికవి మహర్షి రామాయణ గ్రంథాన్ని రచించడం ఒక విశేషమన్నారు. అయితే ఆ సీతారాముల గురించి ప్రపంచానికి చాటి చెప్పివిధంగా నేడు వాల్మీకి జయంతితో పాటు విగ్రహల ప్రతిష్టలు చేయడం గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ప్రతి ఒకరు భక్తి శ్రద్ధలతో సంప్రదాయాలతో అ దేవుని అనుగ్రహంతో ఉన్నప్పుడే ప్రతి ఒకరికి మంచి విజయలు కలుగుతాయి అన్నారు. భారతదేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మరణించిన వారికి ప్రభుత్వం తరపున జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
గద్వాల నియోజకవర్గంలో ప్రతి గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది వాల్మీకి జయంతి వేడుకలు పండగ వాతావరణం వాల్మీకి మహర్షికి పూజించుకొవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. అలాగే గ్రామాలలో రైతులు, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వాల్మీకి మహర్షి ఆశీస్సులతో మనస్ఫూర్తిగా ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు , ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, పి ఎ సి ఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, మధుసూదన్ రెడ్డి సీతారాం రెడ్డి, సత్య రెడ్డి, విక్రమ్ సింహరెడ్డి, మాజీ ఎంపీపీలు రాజారెడ్డి, ప్రతాప్ గౌడ్ విజయ్, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, పార్టీ నాయకులు అజయ్, రమేష్ రెడ్డి , నరసింహ రెడ్డి, వెంకటన్న, నర్సింహులు , నరేందర్, మధు నాయకి, పరశురాముడు, తిమ్మరాజు గోవిందు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.