Friday, October 18, 2024
HomeతెలంగాణJadcharla: చేపల పెంపకంతో మత్స్య కార్మికులకు మెరుగైన ఉపాధి

Jadcharla: చేపల పెంపకంతో మత్స్య కార్మికులకు మెరుగైన ఉపాధి

ఇంచార్జ్ చైర్ పర్సన్ సారిక..

చేపల పెంపకం, విక్రయంతో మత్స్య కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని జడ్చర్ల మున్సిపల్ ఇంచార్జ్ చైర్ పర్సన్ పాలాది సారిక అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట మినీ ట్యాంక్ బండ్ నల్ల చెరువులో గురువారం రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన 60 వేల చేప పిల్లలను ఇన్చార్జి చైర్ పర్సన్ సారిక, మాజీ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కావేరమ్మ పేట మత్స్య కార్మిక చాపల సంఘం సభ్యులతో కలిసి చెరువులో వదిలారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే చేప పిల్లల పెంపకంలో మత్స్య కార్మికులు సరైన జాగ్రత్తలు పాటించి, లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బుక్క మహేష్, చైతన్య చౌహన్, ఏఎంసి డైరెక్టర్ లక్ష్మణ్, చాపల సంఘం అధ్యక్షులు గిరమోని రవీందర్, గుండు గోవర్ధన్, గుండు యాదయ్య, గుండు చంద్రమౌళి, చీకురి వెంకటేష్, గుండు శ్రీశైలం, నాయకులు రామ్మోహన్, కృష్ణారెడ్డి, జగదీశ్ చారి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News