డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపాన వాల్మీకి మహర్షి విగ్రహాం వద్ద మండల వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. వాల్మీకి మహర్షికి ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శీలం భాస్కర్ నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాట్లాడుతూ మహా పుణ్య కవి రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణ జన్ముడని వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి గొప్ప మహర్షి తపఃశ్సాలి, ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్ని భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారని పేర్కొన్నారు. వేటగాడు అయిన రత్నాకరుని నుండి మహర్షి వాల్మీకిగా మారిన తీరుని వివరించారు. వారి జీవిత చరిత్ర ఆధారంగా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదనీ తెలుస్తుందన్నారు. వాల్మీకి జయంతిని అధికారంగా జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. వాల్మీకుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయాలని పేర్కొన్నారు. వాల్మీకులు బాగా చదువుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని, వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవ్ కృష్ణ , దొరపల్లె మల్లికార్జున, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆర్మీ రామయ్య, శీను, లాయర్ కృష్ణమూర్తి, సాక్షి విజ్జి, మల్కిస్ నాయుడు ఉడుములపాడు నాగేంద్ర, డోన్ టౌన్ వాల్మీకివింగ్ ప్రెసిడెంట్ మధు, మిద్దె పిల్ల గోవిందు, వడ్డీల వెంకటేష్, పూల శీను, బుర్రు శ్రీధర్ పాల్గొన్నారు.