Friday, October 18, 2024
Homeచిత్ర ప్రభSuriya: 'రోలెక్స్' పాత్ర గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సూర్య

Suriya: ‘రోలెక్స్’ పాత్ర గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సూర్య

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య(Suriya) ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్(Rolex) పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ లీడర్‌గా సూర్య నటించిన ఈ పాత్ర ఉండేది కేవలం 5 నిమిషాలైనా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే సూర్య తాజాగా నటించిన ‘కంగువా'(kanguva) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘రోలెక్స్‌’ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నటించిన ఓ సినిమాతో దీనికి సంబంధం ఉంటుందన్నారు.

- Advertisement -

‘‘1986లో విడుదలైన ‘విక్రమ్‌’తో 2022లో వచ్చిన ‘విక్రమ్‌’కు ఏవిధంగా లింక్‌ ఉందో అదేవిధంగా ‘రోలెక్స్‌’కూ నేను నటించిన ఒక సినిమాతో కనెక్షన్‌ ఉంటుంది’’ అని సూర్య తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూర్య చెప్పిన ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇక శివ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దిశాపటానీ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ దాదాపు రూ.2000 కోట్లు వసూలుచేస్తుందని ఇటీవలే నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా వస్తారని సమాచారం.

మరోవైపు లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ హీరోలందరితో కలిసి మూవీ చేయాలనుకుంటున్నానని ఇటీవల చెప్పారు. అలాగే త్వరలోనే రోలెక్స్ పాత్రను ఆధారంగా చేసుకొని ఒక పూర్తిస్థాయి సినిమాను తెరకెక్కిస్తానని లోకేశ్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News