గోనెగండ్ల మండలం పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కున్నూరు గ్రామాన్ని శుక్రవారం ఎమ్మిగనూరు డిఎస్పీ యం. ఉపేంద్ర బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు.
- Advertisement -
చిన్నచిన్న మాటలకు, పొరపాట్లకు ఎటువంటి గొడవలు చేసుకోకుండా ఉండాలన్నారు. అనంతరం కొన్నూరు గ్రామంలో పికెట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది తో మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉండాలని ఉండాలని సూచించారు. పికెట్ పాయింట్ బుక్కు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో గోనెగండ్ల సీఐ గంగాధర్, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.