Saturday, October 19, 2024
Homeచిత్ర ప్రభNTR WAR2: 'వార్' చేసేందుకు ముంబైలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్

NTR WAR2: ‘వార్’ చేసేందుకు ముంబైలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్

NTR WAR2| మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన ‘దేవర పార్ట్ 1’ మూవీ బ్లాక్‌బాస్టర్ అందుకుంది. రూ.500కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. తన తర్వాతి సినిమా షూటింగ్ కోసం బయలుదేరాడు. అయితే ఈసారి ఇండియాను షేక్ చేసేందుకు బరిలో దిగుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి ‘వార్-2’ మూవీలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు బీటౌన్ టాక్.

- Advertisement -

‘బ్రహ్మాస్త్ర’ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. తాజాగా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబైలో ల్యాండ్ అయ్యాడు. ఈ షెడ్యూల్‌లో తారక్, హృతిక్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ మాస్ పాట కూడా షూట్ చేయనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాలో పాల్గొనేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈ ఏడాది నవంబర్ నెల‌లో ఎన్టీఆర్-నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ముందుగా తారక్ లేని సన్నివేశాలను తెరకెక్కించే ప్లాన్‌లో ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడట. ఈలోపు వార్ 2కి సంబంధించిన పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘వార్ 2’ మూవీ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీ బాక్సీఫీర్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్‌లో తమ హీరో చేరడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News