Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్GHMC: గ్రామ సింహాల వేట

GHMC: గ్రామ సింహాల వేట

ఇటీవల ఓ నాలుగేళ్ల బాలుడు ఊర కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పో వడంతో ఈ కుక్కల బెడద మళ్లీ తె ర మీదకు వచ్చింది. నగరాన్ని ఈ ఊర కుక్కల బెడద వదిలేలా లేదు. రెండేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌ నగరంలో ఎక్కడో అక్కడ నగర పాలక సిబ్బంది కుక్కలను వ్యానులెక్కిస్తూ కనిపించేవారు. కుక్కల బెడద తగ్గిందని వారు కొద్దిగా విరామం తీసుకునే లోగా మళ్లీ ఈ గ్రామ సింహాలు విజృంభిస్తున్నాయి. నగరంలో ప్రస్తుతం 26 వేలకు పైగా ఊర కుక్కలు సంచరిస్తున్నట్టు అధికారిక సమాచారం. వీటికి కుటుంబ నియం త్రణ చికిత్సలు జరిపించినా, ఊరికి దూరంగా వదిలిపెట్టినా, గ్యాస్‌ వదిలి చంపేసినా వీటి ‘జనాభా’ మాత్రం కొద్దిగా కూడా తగ్గడం లేదు. పగటి వేళ పిల్లలు, మహిళలు వీటి బారిన పడుతుండగా, రాత్రి వేళ ల్లో ఉద్యోగాల నుంచి వచ్చేవారికి ఈ గ్రామ సిం హాలు ఒక సింహస్వప్నంగా మారిపోయాయి. ఈ విధంగా కుక్కల బెడద ముదిరి పోవడానికి అధికారులు చాలా కారణాలు చెబుతున్నారు.
అపార్ట్మెంట్‌ సంస్కృతి పెరిగిపోవడంతో ఈ కుక్కలకు ఆహారం దొరకక పోవడంతో అవి మనుషుల మీద దాడి చేయడం ద్వారా ఆహారాన్ని దక్కించు కుంటున్నాయి. ముఖ్యంగా పిల్లల చేతుల్లో ఆహార పదార్థాలను చూసి అవి వారి మీద దాడి చేస్తున్నాయి. దుకాణాల నుంచి, స్కూళ్ల నుంచి వచ్చే పిల్లలను అవి లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పట్టణీకరణ కారణంగా, అపార్ట్మెంట్స్‌ కారణంగా కుక్కలకు నీళ్లు కూడా దొరక ని పరిస్థితి ఏర్పడుతోంది. వాటికి ఉదయమో, మధ్యా హ్నం భోజనాల వేళ ఆహారం అందించడం ఇది వరకు నగరంలో ఒక ఆనవా యితీగా ఉండేది. ఇప్పుడు ఆ ఆనవాయితీ మటుమాయం అయిపోయింది. మహా రాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల రాజధానుల్లో మాదిరిగా ఇక్కడ ఊర కుక్కలకు పునరావాస కేంద్రాలను ఏర్పా జటు చేయడం కూడా జరగడం లేదు. అంతేకాదు, ఊర కుక్కలలో 25 శాతం కుక్కలకు కూడా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడం సాధ్యం కావడం లేదని నగర పాలక సంస్థ అధికారులు సైతం ఒప్పు కుంటున్నారు. నగర పాలక సిబ్బంది పట్టుకోగలుగుతున్న కుక్కల సంఖ్య కూడా తక్కువేనని చెప్పాలి.
మరో విచిత్రమైన విషయమేమిటంటే, ఊర కుక్కల్లో అత్యధిక శాతం జాతి కుక్కలే. మొదట్లో ఎంతో ప్రేమగా కుక్కల్ని పెంచుకుంటున్నవారు ఆ తర్వాత బదిలీల కారణంగానో, కొత్తగా ఫ్లాట్‌ కొనుక్కున్నందువల్ల నో పెంపుడు కుక్కల్ని వీధుల్లో వదిలేసి వెళ్లిపోవడం జరుగుతోంది. మొత్తం ఊర కుక్కల్లో నలభై శాతానికి 7 పైగా పెంపుడు కుక్కలు ఉంటున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. మొదటి నుంచీ వీధుల్లో తిరిగి ఆహారం సంపాదించుకునే కుక్కలకు, కొంత కాలం పెంపకంలో ఉండి వీధుల్లోకి వచ్చిన కుక్కలకు తేడా ఉంటుందని ఒక అధికారి వివరించారు. వీధులపాలైన పెంపుడు కుక్కలే ఎక్కువగా హింసకు పాల్ప డుతుంటాయని, ఇవే పిల్లల మీదా, నిస్సహాయుల మీదా దాడి చేస్తుంటాయని ఆ అధికారి వివరించారు. ఇ క కుక్కల వల్ల ఎన్ని ఇబ్బందులకు పడుతున్నా వాటికి జోలికి వెళ్లకపోవడమనేది ప్రజలకు కూడా ఒక అల వాటుగా, సహజ లక్షణంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
నిజానికి, కుక్కలే కాదు, నగరంలో పలు చోట్ల కోతుల బెడద కూడా ప్రజలను పీడిస్తోంది. పైగా కుక్కల మాదిరిగా ఇవి నిస్సహాయుల మీద కాకుండా ఎవరి మీదనైనా దాడి చేయడం వల్ల, అనేక ప్రాంతాలలో దాదాపు కర్ఫ్యూ వాతావరణం కూడా నెలకొంటోంది. కోతుల దాడిని పసికట్టి స్థానికులు ఇళ్లల్లో తలుపులు మూసుకుని కూర్చోవాల్సి వస్తోంది. రసూల్పురా, బహదూర్గుడా వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో కోతులు తిరుగాడుతుండడంతో స్థానికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కోతులను పట్టుకోవడం, వాటిని అడవుల్లో వదిలి పెట్టడం అన్నది చాలా ఖరీదైన వ్యవహారంగా అధికారులు చెబుతు న్నారు. దేశం లోని అన్ని రాష్ట్రాలలోనూ కోతుల బెడద ఉందని, అడువులను కొట్టేస్తున్నందువల్ల ఇవి ఊళ్ల మీద పడుతున్నాయని నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. కోతులను పట్టుకోవడానికి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. టెండర్‌ పాడుకున్న వారికి కోతికి 1600 రూపాయల చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 1600 రూపాయలకు కోతిని పట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఒక కోతిని పట్టుకోవడానికి 6,000 చెల్లించడం జరుగుతోంది.
అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ప్రజల్లోని ’హద్దులు దాటిన భూతదయ’ కూడా నగరంలో కుక్కలు, కోతుల బెడద పెరగడానికి కారణం అవుతోంది. కుక్క లను పట్టుకోవడానికి నగర పాలక సిబ్బంది వచ్చినప్పుడు స్థానికులే అడ్డుపడు తుంటారని, సిబ్బందికి ఏమాత్రం సహకరించరని కూడా అధికారులు చెబుతు న్నారు. వీధి కుక్కలకు, ఊర కుక్కలకు నిత్యం ఆహారం పడేసే కుటుంబాలు కూడా ఉన్నాయని, ఈ అలవాటు వల్ల కుక్కలు వారి జోలికి రాకపోవచ్చు కానీ, ఇతరుల మీద మాత్రం దాడి చేస్తుంటాయని అధి కారులు తెలిపారు. ప్రజలకు, అధికారు లకు మధ్య సమన్వయం లేనిదే, ప్రజల నుంచి సహకారం లభించనిదే కుక్కలు, కోతుల బెడదను అరికట్టడం సాధ్యం కాదని కూడా అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News