Monday, November 25, 2024
HomeతెలంగాణAmruth Bharath Station scheme: రాష్ట్రంలో రైల్వే స్టేషన్స్ కు మహర్దశ

Amruth Bharath Station scheme: రాష్ట్రంలో రైల్వే స్టేషన్స్ కు మహర్దశ

38 రైల్వే స్టేషన్స్ లో..

భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్దితో ఒక భారీ పరివర్తన దిశగా పురోగమిస్తుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏ. బి. ఎస్.ఎస్) కింద ఆధునిక ప్రయాణీకులకు సౌకర్యాలను అందించడానికి, ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 39 రైల్వే స్టేషన్‌లు, 430 కోట్ల వ్యయంతో శాటిలైట్ టెర్మినల్ గా అభివృద్ధి చెందుతున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్‌తో సహా రైల్వే స్టేషన్‌లు తిరిగి అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇతర రైలు టెర్మినల్స్ లో రద్దీ తగ్గించడానికి చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి చేస్తున్నారు.

- Advertisement -

మాస్టర్ ప్లాన్ ప్రకారం సౌకర్యాలు :
• ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు.
• స్టేషనుకు దారి తీసే రోడ్లను వెడల్పు చేయడం ద్వారా రాకపోకలను సులభతరం చేయడం
• సరైన రీతిలో రూపొందించబడిన సైనేజీలు, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, సరైన పార్కింగ్ ప్రదేశం, మెరుగైన లైటింగ్
• స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్
• ఆహ్లాదకర అనుభూతిని చేకూర్చేలా స్థానిక కళలు, సంస్కృతికి ప్రాధాన్యత
• ‘‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’’ పథకం కింద స్టాళ్లు
• స్టేషన్ ప్రాంగణానికి రెండవ ప్రవేశం ఏర్పాటు
• ఎక్కువ ఎత్తున్న ప్లాట్ఫారంల నిర్మాణం, సరిపడే విధమైన షెల్టర్ల నిర్మాణం.
• మరింత నాణ్యత గల పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్ఈడి స్టేషన్ నేమ్ బోర్డులు, వెయిటింగ్ హాళ్లకు అభివృద్ధి పనులు, వినియోగదారుల కోసం సైనేజీలు
• స్టేషన్లను ‘సిటీ కేంద్రాలు’గా అభివృద్ధి చేయడం
• నగరానికి రెండు వైపులా అనుసంధానం

తుది అంకంలో కాచిగూడ, లింగంపల్లి స్టేషన్స్..

కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్‌ల కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనం ఫైనల్ ప్రక్రియలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 38 స్టేషన్లను 1830.4 కోట్లతో ఆధునీకరించనున్నారు. వీటిలో .. ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, హుప్పుగూడ, జన్గావ్, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబాబాద్, మహబూబ్నగర్, మలక్ పేట, మల్కాజ్గిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, యాదాద్రి, జహీరాబాద్, బాసర, బేగంపేట, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, పెద్దపల్లి, షాద్నగర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాకుత్పురా, జోగులాంబ స్టేషన్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News