Sunday, October 20, 2024
HomeతెలంగాణMallapur: రెడ్డిల హక్కుల కోసం బలంగా పోరాడనున్న రెడ్డి ఐక్యవేదిక

Mallapur: రెడ్డిల హక్కుల కోసం బలంగా పోరాడనున్న రెడ్డి ఐక్యవేదిక

రెడ్డి సంక్షేమం కోసం..

రెడ్డి ఐక్యవేదిక జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల భూమ రెడ్డి అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించగా నూతన అధ్యక్షునిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా బద్దం శ్రీనివాస్ రెడ్డిని యువజన విభాగం అధ్యక్షుడిగా మేడారపు సతీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెడ్డి ఐక్య వేదిక రాష్ట్రస్థాయిలో బలమైన వేదికను రెడ్డి హక్కుల కోసం పోరాడుతున్నది రెడ్డి ఐక్యవేదిక అని, రెడ్డిల ఐక్యత కోసం నూతన కార్యవర్గం ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాడు మనోహర్ రెడ్డి ఐక్యవేదిక నాయకులు రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News