జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణంలో అన్ని గ్రామాల మున్నూరుకాపు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో మున్నూరుకాపు మండల అధ్యక్షులుగా చిర్నేని రాజశేఖర్, గౌరవ అధ్యక్షులు జెగిశెట్టి శ్రీనివాస్ , ఉపాధ్యక్షులుగా రామకిస్ట్ గంగాధర్, తాటి గంగాధర్, ప్రధాన కార్యదర్శి చుక్క జనార్దన్, కోశాధికారి సైండ్ల మల్లేశం, కార్యదర్శిలుగా గురునాథం మల్లేశం, మ్యాడ మల్లేశం, కొల్లూరి ప్రభాకర్, సలహాదారులుగా మ్యాడ జనార్దన్, మెండు గంగాధర్, కార్యవర్గ సభ్యులుగా చిర్నేని నరేష్, సల్ల లక్ష్మణ్, పూదరి గణేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మున్నూరు సంఘం కులస్తులు తెలిపారు. బీర్ పూర్ మండలంలోని గ్రామలలో కనీసం 600 కులస్తుల కుటుంబాలు కలవు అని తెలిపారు. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ బీర్ పూర్ మున్నూరుకాపు కుల బంధువులందరికీ అన్నీ విధాలుగా ఎల్లవేళలో సేవలు అందిస్తానని నూతనంగా ఎన్నికైన మున్నూరుకాపు సంఘం మండల అద్యక్షులు చిర్నేని రాజశేఖర్ తెలిపారు. మండల అన్ని గ్రామాల మున్నూరుకాపు కుల బంధువులందరు పాల్గొన్నారని వారు తెలిపారు.
ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల మున్నూరుకాపు బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మండలంలో మున్నూరుకాపు ఉన్నతికి కృషి చేస్తామని, మున్నూరుకాపు సంఘాల అభ్యున్నతికి పాటుపడుతామని మున్నూరుకాపులు ఐక్యంగా ఏకతాటిపై ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరము నూతనంగా ఎన్నికైన వారందరికీ శాలువాతో సన్మానము చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మసర్తి రమేష్, ఏనుమట్ల శ్రీనివాస్, మడిపెల్లి శ్రీనివాస్, సైండ్ల శ్రీనివాస్, పురంశెట్టి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ఏనుమట్ల హరీష్, సల్ల రాములు, జెగిశెట్టి నర్సయ్య, చిర్నేని రవి, సందీప్, మహేష్, శ్రీనివాస్ మండలంలోని అన్ని గ్రామాల మున్నూరుకాపు కులస్తులు పాల్గొన్నారు.