దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేరడిగొండ జాతీయ రహదారి నుంచి కుంటాల జలపాతానికి వెళ్ళే రహదారిలో 3.30 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ వంతెన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం బీజేపీ పనిగా పెట్టుకుందని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్ని తామే ఇచ్చామని చెప్పుకునే బీజేపీ నేతలు, అవే పథకాలను వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీటీసీ అనిల్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.