Sunday, October 20, 2024
Homeచిత్ర ప్రభKICCHA SUDEEP: కిచ్చా సుదీప్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

KICCHA SUDEEP: కిచ్చా సుదీప్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

KICCHA SUDEEP| కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌కి మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. సుదీప్ మాతృమూర్తి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదలచేశారు. ‘శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీమతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని శ్రీ సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను ” అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

కాగా సుదీప్ తల్లి సరోజా సంజీవ్(8౩) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వయసు సంబంధింత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడటంతో హుటాహుటని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం సాయంత్రం వరకు ఇంట్లోనే పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విల్సన్ గార్డెన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News