Saturday, October 5, 2024
HomeతెలంగాణIT Raids : మల్లారెడ్డికి నోటీసులు.. సోదాల్లో భారీగా నగదు స్వాధీనం

IT Raids : మల్లారెడ్డికి నోటీసులు.. సోదాల్లో భారీగా నగదు స్వాధీనం

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, కూతుర్లు, వియ్యంకుల ఇళ్లు, కార్యాలయాలపై నవంబర్ 22న తెల్లవారుజామున ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల పాటు జరిగిన సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజీల విషయంలో భారీగా స్కామ్ లు జరిగినట్లు గుర్తించారు. మరోవైపు ఐటీ దాడులు జరుగుతుండగానే ఆయన కుమారుడు మహేందర్ ఛాతినొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. అనంతరం మరొకరు కూడా ఆస్పత్రిలో చేరారు.

- Advertisement -

తన కొడుకుని సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉంటే.. సోదాల సమయంలో మంత్రి , కుటుంబ సభ్యుల ఫోన్లు చెత్తబుట్టల్లో ఉండటం ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చింది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి నివాసంలో రూ. 6 లక్షలు, పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో రూ. 12 లక్షలు, చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో రూ. 6 లక్షలు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ. 1.5 కోట్లు , త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్లు, ప్రవీణ్ కుమార్ నివాసంలో రూ. 2.5 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో కోటి రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నవంబర్ 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News