Monday, October 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Pinipe Srikanth: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్..!

Pinipe Srikanth: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్..!

Pinipe Srikanth| కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన హత్యలు, కబ్జాలు, నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా రెండు సంవత్సరాల క్రితం జరిగిన కోనసీమ అల్లర్లలో హత్యకు గురైన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్థానిక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే..?

2022లో కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీంతో తమ జిల్లాకు అంబేద్కర్ పేరు అవసరం లేదంటూ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో అనేక మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో 2022, జూన్ 6న అయినవిల్లిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడు దుర్గాప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ఆదేశాలతోనే అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేశ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అయితే ఈ కేసులో మరో నలుగురు నిందితులతోపాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మదురైలో శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

హత్య ఎలా చేశారంటే..?

దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌.. ధర్మేశ్‌తో పాటు మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించారు. హత్యకు ముందు దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్‌.. కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లగా వెనుక కారులో నలుగురు అనుసరించారు. అనంతరం ఓ వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా కారులో వచ్చిన వారిలో ముగ్గురు దుర్గాప్రసాద్‌ మెడకు తాడు బిగించి హత్య చేశారని నిందితుడు ధర్మేశ్‌ చెప్పినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసుగా నమోదు చేయగా.. కొన్నాళ్లకు మృతదేహం లభించగా పోస్టుమార్టంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News