Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్CM ChandraBabu in Police Commemoration Day: నేరాలు చేస్తే అదే చివరి రోజు.. రౌడీలకు...

CM ChandraBabu in Police Commemoration Day: నేరాలు చేస్తే అదే చివరి రోజు.. రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

CM ChandraBabu| రాష్ట్రంలో ఎవరైనా నేరం చేయాలంటే భయపడేలా పోలీసులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నేరాలు చేస్తే.. రౌడీలకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి మెండుగా జరగాలంటే లా అండ్ అర్డర్ ముఖ్యమన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశ్రించారు. ప్రజాసేవ కోసం విధి నిర్వహణలో అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

“రాష్ట్రంలో ఏ ప్రగతి జరగాలన్నా పోలీసు సేవలు అవసరం. రాత్రి-పగలు పనిచేసేది పోలీసులు. అన్ని శాఖల్లో కీలకమైంది పోలీస్ శాఖ. 24 గంటలు పనిచేసే శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఏపీలో జీరో క్రైమ్ ఉండాలి. రాష్ట్రంలో నేరాలు చేయాలంటే భయపడే విధంగా వ్యవహరించాలి. లా అండ్ ఆర్డర్ మొదటి ప్రాధాన్యత. పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాం. పోలీస్ సంక్షేమం కోసం ప్రతి ఏడాది నిధులు ఇస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం కేంద్రం కూడా ముందుకు వస్తోంది. పోలీసులపై పెట్టుబడి అంటే రాష్ట్ర అభివృద్ధికి కోసం పెట్టిన పెట్టుబడి. నేరస్తులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నపుడు.. పోలీసులు పాత తరం వాడితే పోరాటం చేయటం కష్టం. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్‌ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని అన్నారు.

“గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు, రాజకీయ వేధింపుల కోసం పోలీసులను వాడారు. ఐపీఎస్ వ్యవస్థను కూడా ఇందుకోసం వాడారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మాజీ సీఎం జగన్ రక్షణ కోసం 12 కోట్లతో కంచె ఏర్పాటు చేసుకుని.. ఫింగర్ ప్రింట్ కోసం 10 కోట్లు ఇవ్వలేదు. సర్వే రాళ్లపై బొమ్మ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన జగన్.. సీసీ కెమెరాల కోసం రూ.700 కోట్లు మంజూరు చేయలేదు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పోలీసులకు సరెండర్ లీవ్ ఇవ్వలేదు. డిజిటల్ కాలంలో నేరాల తీరు మారుతోంది. పోలీసు వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆధునిక పరికరాలు తెప్పిస్తాం. పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల కంటే ముందే టెక్నాలజీ ఒడిసిపట్టాలి. అలాగే రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News