Friday, April 4, 2025
HomeతెలంగాణBirpur: అకాల వర్షం..అపార నష్టం

Birpur: అకాల వర్షం..అపార నష్టం

అకాల వర్షం..

జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్ మండలంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో అకాల వర్షం రావడంతో రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో మంటున్నారు. బీర్ పూర్ మండలంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి, వరి పంటలతో పాటు ఇతర పంటలు నేలకొరిగాయి.

- Advertisement -

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు అంచనా వేసి నష్టపోయిన రైతులందరికీ  ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూడాలని మండల నాయకులను మరియు అధికారులను రైతులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News