Monday, November 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Nagarjuna: వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున..!

Nagarjuna: వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున..!

Nagarjuna| అల్పపీడనం కారణంగా అనంతపురంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో వాంగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జాతీయ రహదారులపై వరద నీరు చేరుకుంది. దాంతో పలు చోట్లు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరదల్లో చిక్కుకుపోయారు. అనంతపుర పట్టణంలో ఓ ప్రైవేట్ జ్యూయెలర్స్ షాపు ఓపెనింగ్‌కు నాగార్జున అతిథిగా వెళ్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ధర్మవరం మీదుగా అనంతపురం చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గ మాధ్యంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో నాగార్జున ప్రయాణిస్తున్న కారు ఇరుక్కుపోయింది. దీంతో ఆయన పెనుకొండ మీదుగా అనంతపురం చేరుకోనున్నారని తెలుస్తోంది. నాగార్జున వరదలో చిక్కుకున్నారన్న వార్త తెలుసుకున్న స్థానికులు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

- Advertisement -

ఇదిలా ఉంటే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లిలో వరద చేరుకుంది. ముఖ్యంగా కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంట పొలాల్లోకి భారీ వరద నీరు చేరుకుంది. దీంతో రైతులు తీవ్ర నష్టం ఏర్పడింది. సమాచారం అందుకున్న మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితులను పరామర్శించారు. అలాగే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్, లియో సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే కాకుండా మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నారు. అయితే ఇటీవల నాగ్ కుటుంబానికి గడ్డు కాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్‌లో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌ అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అలాగే నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచన ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ కోర్టు విచారణలో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News