Tuesday, October 22, 2024
HomeతెలంగాణJagga Reddy: సీఎం రేవంత్ రెడ్డి తిడితే కేటీఆర్ తట్టుకోలేరు: జగ్గారెడ్డి

Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డి తిడితే కేటీఆర్ తట్టుకోలేరు: జగ్గారెడ్డి

Jagga Reddy| బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) రాజకీయాల్లో బచ్చా అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఎలాంటి అంశాలపై మాట్లాడాలో కేటీఆర్‌కు తోచడం లేదని.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఎలా తిట్టాలో సీఎం రేవంత్ రెడ్డి(CM RevanthReddy) దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి కష్టపడి రాజకీయాల్లో ఎదిగారని.. నీలాగా అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని ఫైర్ అయ్యారు. తండ్రి కేసీఆర్‌(KCR)లా కేటీఆర్ ఢక్కా మొక్కలు తినలేదన్నారు. అందుకే కేటీఆర్ బాయిలర్ కోడి లాంటి వారంటూ సెటైర్లు వేశారు.

- Advertisement -

గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేరుకు సీఎం కేసీఆరే అయినా ప్రభుత్వాన్ని నడిపించింది మాత్రం కేటీఆరే అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా బావబామ్మర్దులు ఆ మాటలను వక్రీకరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఇద్దరి కథలు అట్లున్నాయ్ కాబట్లే రేవంత్.. మిమ్మల్ని తిడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ తిట్లను కేటీఆర్ తట్టుకోలేరని తెలిపారు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి కేటీఆర్ దండుపాళ్యం నాయకుడలా తయారయ్యాంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కూడా దండుపాళ్యం బ్యాచ్‌లాగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

దామగుండం 360 మీటర్ల ఎత్తు ఉందని.. దీంతో అక్కడ నుంచి సిగ్నల్స్ పంపడానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు అనేక సానుకూలతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాడార్ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎత్తు ఉంది కాబట్టి మనం సేఫ్ అన్నారు. దేశ రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం ఇంప్లిమెంట్ చేశారన్నారు. దామగుండంలో రాడార్‌కు జీవో ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని జగ్గారెడ్డి గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News