అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్, ఫ్యాషన్ ప్రియులు అత్యంత ఇష్టపడే వెడ్డింగ్, ఫెస్టివ్-బ్రైడల్ ఎగ్జిబిషన్-హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. పెళ్లిళ్లు, పండుగ సీజన్ లో ఈ హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావటంతో ఎగ్జిబిషన్ మరింత సందడిగా మారింది. దీంతో నగరవాసుల్లో ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
నటి ఆశు రెడ్డి, నటి శ్రీ సాయి రెడ్డి ఈ కార్యక్రమంలో తళుక్కుమని మెరిసి, అట్రాక్ట్ చేశారు.
అగ్రశ్రేణి డిజైనర్ల క్యూరేషన్..
దేశంలోని అగ్రశ్రేణి డిజైనర్‌లచే అత్యంత క్యూరేటెడ్ డిజైన్‌లను ఫీచర్ చేయడం హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రత్యేకత. దీంతో పెళ్లిళ్లకు, పండుగలకు షాపింగ్ చేసే ఫ్యాషన్ ప్రియులకు మరింత ప్రత్యేక షాపింగ్ అనుభూతి కల్పించేలా ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ట్విన్ సిటీస్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ గా బ్రాండింగ్ సంపాదించుకున్న ఈ హైలైఫ్ ఎగ్జిబిషన్ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ లాగానే, “హైలైఫ్ బ్రైడ్స్” అనేది ఉత్తమమైన ఆభరణాలు, దుస్తులు, ఉపకరణాలు, పాదరక్షలు, మరెన్నో ఒకే పైకప్పు కింద డెస్టినేషన్ షాపింగ్ అనుభవాన్ని కలిగిస్తూ నెక్ట్స్ లెవెల్ ఫీలింగ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఇస్తోంది.
వెడ్డింగ్ వైబ్స్..
హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈసారి వెడ్డింగ్ వైబ్స్ తో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈనెల 22, 23, 24న అంటే మూడు రోజులుపాటు హెచ్.ఐ.సి.సి. నోవోటెల్ లో ఎగ్జిబిషన్ సాగుతోంది. హైలైఫ్ ఎగ్జిబిషన్ సీఈఓ-ఎండీ అభి పి. డోమినిక్ మాట్లాడుతూ.. ఇదో పెద్ద ఫ్యాషన్ ఫెస్టివల్ అని అభివర్ణించారు. లైఫ్ స్టైల్ సెగ్మెంట్ లో అతిపెద్ద ఎగ్జిబిషన్ గా ఇది నిలుస్తూనే హైలైఫ్, లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చేలా కలెక్షన్ ను ప్రదర్శిస్తోందని వివరించారు. డిజైనర్లకు-కస్టమర్లకు ఇది అత్యద్భుతమైన వేదికగా ఉండేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈవెంట్ ను నిర్వహిస్తుండటం హైలైట్.