ఐఎండి సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇది దాదాపు పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 700 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 750 కి.మీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 730 కి.మీ. దూరంలో ఉంది.
• ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటికి( అక్టోబర్ 23) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, వాయువ్య దిశగా కదులుతూ గురువారం ( అక్టోబర్ 24) ద్వారా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడుతుంది. ఆ తరువాత అక్టోబర్ 24వ తేదీ రాత్రి – అక్టోబర్ 25 ఉదయంలోపు ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరీ మరియు సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో అక్టోబరు 24 & 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
సముద్రం అలజడిగా ఉంటుంది.
అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్,
విపత్తుల నిర్వహణ సంస్థ.