Wednesday, October 23, 2024
Homeచిత్ర ప్రభPrabhas: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్.. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Prabhas: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్.. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Prabhas: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్‌కు సరిగ్గా సరిపోతుంది. తన కటౌట్‌, నటన, మంచితనంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కృష్ణంరాజు వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఛత్రపతి, డార్లింగ్, మిర్చి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా స్థిరపోయాడు. అనంతరం రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు దక్కించుకున్నాడు. దీంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

- Advertisement -

నేడు ప్రభాస్‌(Prabhas) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభాస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రముఖులు సైతం తమ ప్రియమైన డార్లింగ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, గోపిచంద్, శర్వానంద్, కిరణ్ అబ్బవరం, గోపీచంద్, ఆది సాయికుమార్, బండ్ల గణేశ్ తదితర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

** ఆ కటౌట్‌ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్‌. అతను ప్రేమించే పద్ధతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్‌. లవ్‌యూ: చిరంజీవి

** పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియరెస్ట్ డార్లింగ్: గోపించంద్

** పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న.. నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: శర్వానంద్

** రాజాధిరాజ రాజమార్తాండ మహారాజా శ్రీ ప్రభాస్‌ రాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: బండ్ల గణేశ్‌

** హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌.. వెండితెరపై మీ అద్భుతాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. ఈ ఏడాది కూడా మీ మ్యాజిక్‌ చూడాలని ఆసక్తిగా ఉన్నాం: బాబీ

** నాకు ఇష్టమైన నటుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌: ఆది సాయికుమార్‌

** అందరి డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్ఫూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్‌ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నా: ప్రశాంత్‌ వర్మ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News