Wednesday, October 23, 2024
HomeNewsThe RajaSaab: అదిరిపోయిన ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. 'ది రాజాసాబ్' మోషన్ పోస్టర్ విడుదల

The RajaSaab: అదిరిపోయిన ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. ‘ది రాజాసాబ్’ మోషన్ పోస్టర్ విడుదల

PRABHAS| పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్(PRABHAS) నటిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’(The RajaSaab) నుంచి స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రభాస్‌ సింహాసనం మీద ఓ చేతిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి అభిమానుల్లో జోష్‌ నింపారు. ఈ మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ అడవిలో పియానో ప్లే అవుతుండగా.. ఓ భవంతిలోకి తీసుకెళ్లి ప్రభాస్ ముసలి గెటప్‌లో చుట్ట కాల్చుతూ సింహాసనం మీద కూర్చున్నట్టు కనిపిస్తోంది. చివరిలో హారర్ కొత్త కామెడీ అని పోస్ట్ చేయడంతో ఈ మూవీ హారర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోందని అర్థమవుతోంది.

- Advertisement -

ఇందులో ప్రభాస్ రెండు గెటప్‌లలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తాత, మనవడు లేదా తండ్రి, కొడుకు పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లుక్‌లో తమ హీరో అదిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

మరోవైపు ప్రభాస్‌(Prabhas) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభాస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రముఖులు సైతం తమ ప్రియమైన డార్లింగ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, గోపిచంద్, శర్వానంద్, కిరణ్ అబ్బవరం, గోపీచంద్, ఆది సాయికుమార్, బండ్ల గణేశ్ తదితర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజాసాబ్ చిత్రంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్వాతంత్యం పూర్వం నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ సలార్2 చిత్రంలోనూ నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News