Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: ఆస్తి వివాదం.. తల్లి, చెల్లిపై మాజీ సీఎం జగన్ కోర్టులో పిటిషన్

YS Jagan: ఆస్తి వివాదం.. తల్లి, చెల్లిపై మాజీ సీఎం జగన్ కోర్టులో పిటిషన్

YS Jagan| వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కుటుంబంలో ఆస్తి వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కొంతకాలంగా జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల(YS Sharmila)తో ఆస్తి తగాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదనే కోపంతో షర్మిల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన షర్మిల.. ఈ ఏడాది ప్రారంభంలో ఏపీ రాజకీయాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా జాతీయా పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా సొంత రాష్ట్రంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

- Advertisement -

ఎన్నికల సమయం కావడంతో వస్తూ వస్తూనే తన అన్న జగన్‌ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హంతకులను కాపాడుతున్నారంటూ ఊరువాడా ప్రచారం చేశారు. హంతకుల కోసం సొంత కుటుంబసభ్యులను కూడా దూరం చేసుకున్నారని ప్రజలకు చెప్పుకుని వాపోయారు. దీంతో అటు కూటమి విమర్శలు కన్నా.. షర్మిల విమర్శలతోనే జగన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. షర్మిల దూకుడుతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు చీలిపోయింది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లడంతో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో జగన్ అధికారం నుంచి ఘోర అవమాననంతో దిగిపోవాల్సి వచ్చింది.

ఓవైపు అధికారం కోల్పోవడం, మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ పరిస్థితి తారుమారు పోయింది. ఓవైపు పార్టీలోని కీలక నేతలందరూ రాజీనామాలు చేసేసి కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. దీంతో జగన్ రాజకీయంగా ఒంటరి అయిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సొంత చెల్లి షర్మిలతో ఉన్న ఆస్తి వివాదాలను పరిష్కరించే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. షర్మిలకు రావాల్సిన వాటాలు ఇచ్చేసి ఆమెతో సయోధ్య కుదుర్చుకోవడానికి బెంగళూరు వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆ వార్తల సారాంశం. దీనిపై అటు జగన్ కానీ, ఇటు షర్మిల కానీ స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

ఇలాంటి తరుణంలో జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా సొంత తల్లి విజయమ్మ(YS Vijayamma), చెల్లి షర్మిలపై కోర్టుకు ఎక్కారు. ఆస్తి పంపకాల విషయంలో విజయమ్మ, షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో జగన్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటేడ్ షేర్ల వివాదంపై జగన్, ఆయన భార్య భారతి రెడ్డి పేర్లతో 5 పిటిషన్లు వేశారు. ఆగస్టు 21, 2019 ఎంవోయూ(MOU) ప్రకారం.. విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు షర్మిల తనకు రాజకీయ శత్రువుగా మారడంతో ఆ ఎంవోయూ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై త్వరలోనే ట్రిబ్యునల్ విచారించనుంది. అయితే ఆస్తి వివాదంలో ఏకంగా తల్లి, చెల్లిపైనే జగన్ కోర్టుకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News