Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్APPSC: ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ నియామకం

APPSC: ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ నియామకం

APPSC| కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఏపీపీఎస్సీ(APPSC) చైర్మన్‌ పోస్టును భర్తీ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అనురాధ(Anuradha)ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. తక్షణమే ఆమె బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు.

- Advertisement -

కాగా గత వైసీపీ ప్రభుత్వం ఏపీపీస్సీ ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ ‌సవాంగ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన హయాంలో బోర్డు సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుడా గ్రూప్ పరీక్షల మూల్యాంకనం కూడా సరిగ్గా నిర్వహించలేదని హైకోర్టు సీరియస్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొన్ని నెలలుగా ఛైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో.. తాజాగా ఆ పోస్టులో అనురాధను నియమిస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News