Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Liquor Sales: మందుబాబులకు శుభవార్త.. రూ.99 మద్యం బాటిళ్లు వచ్చేశాయి..

Liquor Sales: మందుబాబులకు శుభవార్త.. రూ.99 మద్యం బాటిళ్లు వచ్చేశాయి..

Liquor Sales| ఏపీలో మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నూతన మద్యం పాలసీలో భాగంగా రూ.99కే క్వార్టర్ బాటిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈరోజు నుంచే క్వార్టర్ అమ్మకాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఒక్కో షాపునకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని షాపుల్లో పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని తొలగించిన సంగతి తెలిసిందే. అనంతనం మంత్రివర్గం ఆమోదంతో మద్యం షాపులను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగిస్తూ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఇందుకోసం వ్యాపారస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫెండబుల్ నగదుగా రూ.2లక్షలు స్వీకరించారు. దీంతో 3,336 షాపులకు దాదాపు 90వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14వ తేదీన షాపులను లాటరీల్లో కేటాయించగా.. 16వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

దీంతో గతంలో ఉన్న నాసిరకం మద్యం బాటిళ్లు అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి. మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసే నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందించడం ప్రారంభమైంది. దీంతో మందుబాబులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంతవరకు బాగానే ప్రభుత్వం రూ.99లకే క్వార్టర్ బాటిల్ అందిస్తామని చెప్పడంతో మందుబాబులు ఆ బాటిళ్ల కోసం ఆతృతగా ఎదురరుచూస్తున్నారు. కానీ షాపుల్లోకి స్టాక్ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. తాజాగా వారికి అదిరిపోయే వార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి రూ.99 బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మందుబాబులు వైన్‌ షాపులకు క్యూ కట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News