Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Dana cyclone: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో దానా తుపాన్ ఎఫెక్ట్

Dana cyclone: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో దానా తుపాన్ ఎఫెక్ట్

ఈదురు గాలులు..

తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్

- Advertisement -

రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా
రూపాంతరం

గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం

పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనున్న తుపాన్

ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 520 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కిమీ. దూరంలో దానా తుపాన్

దీని ప్రభావంతో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100కిమీ వేగంతో ఈదురుగాలులు

రేపు రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం

• భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
• ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.
• వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
• కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.
• మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.

ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News