Wednesday, October 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: స్మశాన వాటికను కబ్జా చేసిన మేయర్

Karimnagar: స్మశాన వాటికను కబ్జా చేసిన మేయర్

మేయర్ గారి..

కంచెే చేను మేస్తే కాపాడేది ఎవరు అనే చందనంగా ఉంది కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ తీరు. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా స్మశాన వాటికకు కేటాయించిన భూమిని సైతం కబ్జా చేయడం ఆయనకే చెల్లుతుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… కరీంనగర్ నగరపాలక సంస్థలలో విలీనమైన రేకుర్తి 18వ డివిజన్ లోని సర్వే నెంబర్ 65 లో పట్టా భూమిని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు, అపర్ణలు కలిసి ఒకరి పేరు మీద ఐదు ప్లాట్లు ఇంకొకరి పేరు మీద నాలుగు ఫ్లాట్లు మొత్తం తొమ్మిది ప్లాట్లను గత సంవత్సరం ఆగస్టు 10వ తేదీన గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

యాదగిరి అపర్ణ డాక్యుమెంట్ నెంబర్ 5498/2023, 5499/2023, 5500/2023, 5501/2023, 5502/2023 కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు డాక్యుమెంట్ నెంబర్ 50494/2023, 5495/2023, 54962023, 5497/2023. తొమ్మిది ప్లాట్లను గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

దీనికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 55 లో రేకుర్తికి సంబంధించిన దళితుల స్మశాన వాటికలో గతంలో గ్రామ పంచాయతీ నిధులు 15 లక్షల రూపాయలతో దింపుడు కల్లం గద్దె, బోరు బావి, స్నానాల గదులను నిర్మించి అప్పటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పలు గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, గ్రామానికి చెందిన ప్రజల సమక్షంలో 2017 జనవరి 13వ తేదీన ప్రారంభించారు.

మేయర్ ప్లాట్లకు స్నానపు గదులు, బోరుబావి, దింపుడు కళ్లెం గద్దె అడ్డుగా ఉన్నాయని ఎలాంటి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం లేకుండానే డిఈ మసూద్ అలీ సదరు నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారు.

ఈ ప్లాట్ లకు మధ్యలో ఉన్న రహదారులను సైతం వదలకుండా కబ్జా చేసి చుట్టూ ప్రహరీ గోడను మేయర్ యాదగిరి సునీల్ రావు నిర్మించుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న మేయర్ భూకబ్జాలకు పాల్పడడం పట్ల కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్మశాన వాటిక కబ్జాపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దళితులకు తగు న్యాయం చేయవలసిన అవసరం జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పైన ఉంది. దీనిపై అధికారులు ఏ మేరకు స్పందిస్తారు వేచి చూద్దాం.

కరీంనగర్ మేయర్ సునీల్ రావు వివరణ..

ఈ తతంగంపై తెలుగుప్రభ దినపత్రిక రిపోర్టర్ మేయర్ సునీల్ రావును వివరణ అడిగారు. అయితే ఫోన్లో మాత్రమే స్పందించిన సునీల్..”నాకు ఎలాంటి విషయం తెలియదని మీకు ఏమన్నా కావాలంటే రెవెన్యూ వాళ్లను తెలుసుకోండి” అని అన్నారు.

దుర్గం మనోహర్, సామాజిక కార్యకర్త-మాజీ వార్డు సభ్యులు, రేకుర్తి.

“గతంలోనే స్నానాల గదులు, దింపుడు గల్లం గద్దె, తదితర వాటిని కూలగొట్టిన వాటిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, తెలంగాణ డిజిపికి ఫిర్యాదు చేయడం జరిగినది. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు” అని మీడియాకు వివరించారు.

G. రామస్వామి, తెలుగుప్రభ కరీంనగర్ బ్యూరో చీఫ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News