Gold Rates| కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ.80వేలు దాటేయగా.. వెండి అయితే లక్ష రూపాయలు దాటేసింది. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపలేదు. అయితే గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దీంతో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలపై రూ.550 తగ్గింది. దాంతో మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,850గా నమోదైంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.79,740కు చేరుకుంది.
మరోవైపు బంగారం ధరలు దిగిరావడంతో వెండి ధరలు కూడా దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.2వేలు తగ్గి లక్ష రెండు వేలకు చేరుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మాత్రం లక్ష పది వేల రూపాయలుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,850
విజయవాడ – రూ.72,850
ఢిల్లీ – రూ.73,000
చెన్నై – రూ.72,850
బెంగళూరు – రూ.72,850
ముంబై – రూ.72,850
కోల్‌కతా – రూ.72,850
కేరళ – రూ.72,850
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,470
విజయవాడ – రూ.79,470
ఢిల్లీ – రూ.79,620
చెన్నై – రూ.79,470
బెంగళూరు – రూ.79,470
ముంబై – రూ.79,470
కోల్‌కతా – రూ.79,470
కేరళ – రూ.79,470
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,10,000
విజయవాడ – రూ.1,10,000
కేరళ – రూ.1,10,000
ఢిల్లీ – రూ.1,02,000
ముంబై – రూ.1,02,000
చెన్నై – రూ.1,10,000
కోల్‌కతా – రూ.1,02,000
బెంగళూరు – రూ.1,01,000