Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్APPSC: ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాధ

APPSC: ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాధ

APPSC: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) ఛైర్ పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారిణి అనురాధ(Anuradha) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్.. ఆమెతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అనురాధకు బోర్డు సభ్యులు, కార్యదర్శి, సహ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం బోర్డు పరధిలో పెండింగ్‌లో ఉన్న నియామకాలపై సభ్యులు, అధికారులతో ఛైర్ పర్సన్ సమీక్షించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరాతీశారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, కొత్త నోటిఫికేషన్లు గురించి చర్చించారు.

- Advertisement -

కాగా కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఏపీపీఎస్సీ(APPSC) చైర్మన్‌ పోస్టును భర్తీ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అనురాధను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆమె గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీపీస్సీ ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ ‌సవాంగ్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

అయితే ఆయన హయాంలో బోర్డు సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుడా గ్రూప్ పరీక్షల మూల్యాంకనం కూడా సరిగ్గా నిర్వహించలేదని హైకోర్టు సీరియస్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొన్ని నెలలుగా ఛైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో.. ఆ పోస్టులో అనురాధను నియమిస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News