Thursday, October 24, 2024
Homeచిత్ర ప్రభRajasab Record views: ప్రభాస్ రికార్డుల రా'రాజు'

Rajasab Record views: ప్రభాస్ రికార్డుల రా’రాజు’

ఏప్రిల్ 10న రిలీజ్..

ప్రభాస్ .. రికార్డుల రారాజు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. లేటెస్ట్ గా మరోమారు తనకు ఎవరూ సాటి లేరని, టాలీవుడ్ లో రాజు తానేనంటూ ప్రభాస్ రాజు మరోసారి చాటుకున్నారు.

- Advertisement -

24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ట్రెండ్ అ‌వుతున్న ప్రభాస్ “రాజా సాబ్” మోషన్ పోస్టర్.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

వైరల్ లుక్..

“రాజా సాబ్” మోషన్ పోస్టర్ లో రాజా సాబ్ క్యారెక్టర్ లో ప్రభాస్ లుక్ వైరల్ అవుతోంది. మోషన్ పోస్టర్ ను యూనిక్ గా డిజైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కు వస్తున్న భారీ వ్యూస్ ఈ సినిమా మీద నెలకొన్న హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సక్సెసే ఆయన కేరాఫ్..

సక్సెస్ ను కేరాఫ్ గా మార్చుకున్న ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. “రాజా సాబ్” పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News