Thursday, October 24, 2024
Homeచిత్ర ప్రభPushpa2: ఓరోజు ముందుగానే 'పుష్ప2' రిలీజ్.. 'పుష్ప3' పై నిర్మాతలు ఏమన్నారంటే..?

Pushpa2: ఓరోజు ముందుగానే ‘పుష్ప2’ రిలీజ్.. ‘పుష్ప3’ పై నిర్మాతలు ఏమన్నారంటే..?

Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప మూవీతో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోవడంతో పుష్ప2 మూవీ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు తెలియజేశారు. ముందుగా పుష్ప2 మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటించారు. వాస్తవంగా ఈ ఏడాది డిసెంబర్ 6న మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఓరోజు ముందు విడుదల చేయనున్నట్లు తెలిపారు. లాంగ్ వీకెండ్ కలిసొస్తుందనే ఆలోచనతో విడుదల తేదీని ఒక్కరోజు ముందుకు జరిపామన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

- Advertisement -

ఈ సందర్భంగా విలేకరులు.. పుష్ప3 ఉంటుందా అని నిర్మాతలను ప్రశ్నించారు. దీనికి నిర్మాత నవీన్ మాట్లాడుతూ పుష్ప2 హిట్అయితే కచ్చితంగా పుష్ప3 ఉంటుందని స్పష్టంచేశారు. పుష్ప2 ఎండింగ్‌లో పుష్ప3 పార్ట్‌కు లీడ్ ఇస్తామన్నారు. ఇక పుష్ప2 మూవీ ప్రమోషన్స్ గట్టిగా చేస్తామన్నారు. అయితే నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ఎక్కువగా చేద్దామని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చారు. అందుకే ముంబైలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. నవంబర్ నెలలో ట్రైలర్‌తో పాటు 2 లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తామన్నారు. ఇక సినిమాలోని జాతర ఎపిసోస్ చిత్రీకరణకు దాదాపు 35 రోజులు పట్టిందని.. దాని కోసం రిహార్సల్స్‌ కూడా చేశారన్నారు. అందరూ ఊహిస్తున్నట్టే ఆ ఎపిసోడ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందన్నారు.

అలాగే పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ. 1000 కోట్లు క్రాస్‌ అయిందనే వార్తలపై నిర్మాతలు మాట్లాడుతూ థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నారని క్లారిటీ ఇచ్చారు. అయితే నాన్‌ థియేట్రికల్‌ విషయంలో ఇప్పటి వరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) కొరియోగ్రఫీ చేయడం లేదని తెలిపారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ అరెస్ట్ కావడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News