Friday, November 22, 2024
Homeనేషనల్Adilabad: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

Adilabad: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

బోర్డర్ లో..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చతీస్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో  అంకిత్ గోయల్ IPS, డివై, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇట్టి సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) అధ్యక్షత వహించి, రాబోయే ఎన్నికలకు దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి,  ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని  పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించవచ్చని సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు.

- Advertisement -

మెదటగా రామగుండం పోలీస్ కమిషనర్, ఆసిఫాబాద్ ఎస్పీ, భూపాలపల్లి ఎస్పీ, మంచిర్యాల డీసీపీ, SV రాఘవేంద్ర రావు, ఎసిపి SB/NIB రామగుండం రామగుండం కమిషనరేట్ ఆఫీస్ లో ఉన్న హెలిపాడ్ నుండి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లి సమావేశంకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ… మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు, మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించాలని, NBW వారెంట్స్ ల విషయంలో మూడు రాష్ట్రాల పోలీసులు  ఒకరి ఒకరు సహకరించుకోవాలని, మహారాష్ట్ర ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజి , కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం, అంకిత్ గోయల్ ఐపీఎస్ డిఐజి, గడ్చిరోలి, అజయ్ శర్మ డిఐజి ఆపరేషన్ సిఆర్పిఎఫ్, అజయ్ శర్మ డి ఐ జి ఆపరేషన్ సిఆర్పిఎఫ్, కళ్యాణ్ ఎలేసెల ఐపీఎస్ ఎస్పీ  కన్కెర్, వై.పి సింగ్ ఐపీఎస్ ఎస్పీ మొహాల మన్పూర్, నీలోత్పల్ ఐపీఎస్ ఎస్పీ గర్చిరోలి, నూరుల్ హసన్ ఐపీఎస్, ఎస్పీ  భాంధ్ర, ముమ్మక్క సుదర్శన్ ఐపీఎస్ ఎస్పీ చంద్రాపూర్, గోరక్ బామరె ఐపీఎస్ ఎస్పీ గొండియా కిరణ్ కారే ఐపీఎస్ ఎస్పీ భూపాలపల్లి, శ్రీనివాసులు ఎస్పి  ఆసిఫాబాద్. రాబిన్సన్ గురియా ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ నారాయణపూర్, దినేష్ సింహ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ బీజాపూర్, ఏ భాస్కర్ ఐపీఎస్ డిసిపి మంచిర్యాల, ఎం రమేష్ ఐపీఎస్ ఎడిషన్ ఎస్పి అడ్మిన్ గడ్చిరోలి, విశాల్ నాగార్గోజే డి.ఎస్.పి ఆపరేషన్ గడ్చిరోలి, వి రాఘవేంద్రరావు ఏసిపి స్పెషల్ బ్రాంచ్ రామగుండం, రవీంద్ర  భోసలే ఎస్డిపిఓ  కురఖేడ, సూరజ్ జగతప్ ఎస్డిపిఓ,గడ్చిరోలి, జగదీష్ పాండే ఎస్డిపిఓ  పెందరి, చైతన్యకాడం ఎస్డిపిఓ ఈటపల్లి, యోగేష్ రత్నాకర్ ఎస్ డి పి ఓ, హేడారి, అజయ్, కొకటే, ఎస్డిపిఓ అహిరి అమర్ మోహిత్, ఎస్డిపిఓ, భామ్రాగడ్, శశికాంత్ దసుర్ కర్  ఎస్డిపిఓ, జిమలగట్ట, సందీప్ నాయక్ ఎస్డిపిఓ సిరంచ, షేరెనిక్ లోదా ఐపిఎస్., అడిషనల్ ఎస్పీ అహెరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News