Thursday, April 10, 2025
Homeచిత్ర ప్రభBagheera Prashanth Neel story: ప్రశాంత్ నీల్ స్టోరీ, హోంబలే ప్రొడ్యూసర్..'బఘీర' సినిమా

Bagheera Prashanth Neel story: ప్రశాంత్ నీల్ స్టోరీ, హోంబలే ప్రొడ్యూసర్..’బఘీర’ సినిమా

పోలీస్ స్టోరీ..

రోరింగ్ స్టార్ శ్రీమురళి, రుక్మిణి వసంత్ ‘బఘీర’ సెకండ్ సింగిల్ లవ్ మెలోడీ ‘పరిచయములే’ సాంగ్ రిలీజ్

- Advertisement -

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఫస్ట్ సింగిల్, ట్రైలర్ ఇప్పటికే సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పుడు సెకండ్ సింగిల్- పరిచయమేలే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట శ్రీమురళి, రుక్మిణి వసంత్ ప్రేమకథని ప్రజెంట్ చేసింది. బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ హార్ట్ టచ్చింగ్ నెంబర్, రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించింది.

శ్రీమురళి టఫ్ పోలీసు ఆఫీసర్, స్త్రీలకు హాని కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు, రుక్మిణి సున్నితమైన ప్రవర్తన కలిగిన డాక్టర్. రెండు డిఫరెంట్ వ్యక్తిత్వాలు పాటలో బ్యుటీఫుల్ అండ్ డైనమిక్‌ గా ప్రజెంట్ చేశారు. రాంబాబు గోసాల లవ్లీ లిరిక్స్‌ ఆకట్టుకున్నాయి. రితేష్ జి రావు తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాట లీడ్ పెయిర్ మధ్య డాజ్లింగ్ కెమిస్ట్రీని హైలైట్ చేస్తుంది.

ఈ చిత్రానికి AJ శెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్‌గా ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి సంతేహక్లు పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News