Jani Master| ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)కు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ కేసు నుంచి ఆయన ఇప్పుడల్లా బయపటపడేలా కనిపించడం లేదు. కానీ ఈ కేసుతో జానీ జీవితం ఒక్కసారిగా మారింది. ఇప్పటిదాకా తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలు దెబ్బతిన్నాయి. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న నేషనల్ అవార్డు రద్దు అయింది. ఒకప్పుడు కచ్చితంగా జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయాల్సిందే్ అనుకునే నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు ఆయనను పక్కనపెట్టేస్తున్నారు.
సుమారు 36 రోజుల పాటు ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్.. నేరుగా హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నాడట. అనంతరం ఓ ప్రముఖ డైరెక్టర్, కొందరు కొరియోగ్రాఫర్‌లతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సంద్భంగా జైలులో తనకు ఎదురైన అనుభవాలను వారితో పంచుకున్నారట. తనకు ఇంకా జైలులోనే ఉన్నట్లు అనిపిస్తోందని.. అక్కడి ఫుడ్ తినలేకపోయానని వాపోయారట. ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారట. తాను మళ్లీ సాధారణ పరిస్థితి రావాలీంటే కొన్ని రోజులు పడుతుందన్నారట. త్వరలోనే మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు బయటపెడతాను అని చెప్పారట.
కాగా తనను లైంగింకంగా వేధిస్తున్నాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు జానీని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో 36 రోజుల పాటు జైలులో ఉన్నారు. మరోవైపు తాను కొరియోగ్రాఫ్ చేసిన ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3) మూవీలోని హరే రామ్.. హరే రామ్(Hare Ram.. Hare Ram) అనే టైటిల్ ట్రెండింగ్‌లో ఉంచినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.