Sunday, November 24, 2024
HomeతెలంగాణManda Krishna: రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు చాలా నయం: మందకృష్ణ

Manda Krishna: రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు చాలా నయం: మందకృష్ణ

Manda Krishna|తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మార్పీస్(MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయూత పింఛన్‌లు తీసుకునే వారిని రేవంత్(CM Revanth Reddy) ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారా చేయూత పింఛన్‌దారులందరినీ ఏకీకృతం చేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. త్వరలోనే బలమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యంగా పింఛన్‌దారులనూ దారుణంగా మోసం చేసిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మిన ప్రజలు ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు.

- Advertisement -

ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినా ఎందుకు పింఛన్ పెంచి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఏపీలో చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి లబ్ధిదారులకు ఇస్తోందని గుర్తుచేశారు. ఎన్నికలకు మందు గత ఏప్రిల్ నెలలో చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చామని.. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్‌ ఇవ్వాలని కోరామని తెలిపారు. ఆయన జూన్‌లో అధికారంలోకి రాగానే ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలవి కలిపి పింఛన్ ఇచ్చారని కొనియాడారు. ఏపీలో కండరాల క్షీణత ఉన్నవాళ్లకు రూ.15 వేల పింఛన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అందుకే రేవంత్ కంటే చంద్రబాబు చాలా నయమని మందకృష్ణ ప్రశంసించారు.

తెలంగాణలో వచ్చే నెల మొదటి వారంలో గడిచిన 10 నెలల బకాయిలతో పాటు నవంబర్ పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో ఉద్యమం తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 1 నుంచి 16 వరకు ప్రతిరోజు రెండు జిల్లాల్లో చేయూత పింఛన్‌ లబ్ధిదారులకు చైతన్య సభలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ కూడా ప్రభుత్వం ఇవ్వకుంటే నవంబర్ 26న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామన్నారు. అదేరోజు వికలాంగుల మహా గర్జన పేరిట వేలాది మందితో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను ఈ సభకు ఆహ్వానిస్తామన్నారు. ఇక నుంచి రేవంత్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని మందకృష్ణ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News