Friday, September 20, 2024
HomeదైవంSrisailam: శుక్రవారం ఊంజల సేవ

Srisailam: శుక్రవారం ఊంజల సేవ

శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవ నిర్వహించింది. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఉయ్యాల సేవ నిర్వహించటం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పటించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊయలలో వేంచేబు చేయించి శాస్త్రోత్తకంగా షోడసోపచార పూజలు చేశారు. ఊయల సేవను పునస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారికి విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చన నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News