Sunday, October 27, 2024
HomeదైవంTirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala| తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య సాధారణంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 6 నుంచి 8 గంటలకు పైగా సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోంది. శనివారం స్వామివారి దర్శనం కోసం మోస్తరుగా భక్తులు తరలివచ్చారు. 77,844 మంది భక్తులు దర్శించుకోగా..27,418 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.327కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడగించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఇవాళ కూడా భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కాంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎవరూ లేకపోవడంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలోనికి నేరుగా పంపుతున్నారు. మరోవైపు నాలుగు రోజుల్లో దీపావళి పండుగ రానుండటంతో భక్తుల రాక క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు.

మరోవైపు తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. ఇటీవల తిరుమలకు కాలి నడకన వస్తూ కొందరు భక్తులు అస్వస్థతకు గురికావడంతో కొన్ని కీలక సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావొద్దని టీటీడీ సూచించింది. ఒకవేళ ఎవరైనా మెట్ల మార్గాల్లో రావాలనుకుంటే.. అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి దగ్గర వైద్య సహాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News