Friday, November 22, 2024
HomeతెలంగాణBandi Sanjay: కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లోనే రేవ్ పార్టీలా..? నిందితులను కఠినంగా శిక్షించాలి: బండి

Bandi Sanjay: కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లోనే రేవ్ పార్టీలా..? నిందితులను కఠినంగా శిక్షించాలి: బండి

Bandi Sanjay| మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ(Rave Party) జరగడంఎపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) తీవ్రంగా స్పందించారు. ‘‘రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై సుద్దపూస కేటీఆర్‌ ఇప్పుడేమంటారో. డ్రగ్స్‌ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో? కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సుద్దపూస కేటీఆర్‌ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయ్. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్​పై రాజీ ధోరణి ఎందుకు? సీసీ ఫుటేజ్‌ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. బడా నేతలతో సహా రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలి” అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ఇక ఈ డ్రగ్స్ పార్టీపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా తనదైన శైలిలో స్పందించారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సిట్ వేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు చెందిన ఫాం హౌస్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ పార్టీలో పాల్గొన్న బడా నేతలతో సహా ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని చెప్పుకొచ్చారు.

కాగా జన్వాడలోని ఓ ఫాంహౌస్‌పై నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్ లో ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. రాజ్ పాకాల.. కేటీఆర్(KTR) బామ్మర్ది అని సమాచారం. శనివారం అర్థరాత్రి భారీ శబ్ధాలతో పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫాంహౌస్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఈ పార్టీకి ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని గుర్తించారు.

ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా.. ఇందులో విజయ్ మద్దూర్ అనే పాజిటివ్‌గా నిర్థరణ అయింది. కొకైన్‌ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలపై సెక్షన్‌34, ఎక్సైజ్‌ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News