Sunday, October 27, 2024
HomeఆటAllu Arjun: డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్

Allu Arjun: డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్

Allu Arjun| ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్(David Warner) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే వార్నర్‌కు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ టోర్నీలో తెలుగు రాష్ట్రానికి చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా తెలుగు సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. దీంతో తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో వార్నర్ చేసే రీల్స్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌కు.. ‘అల వైకుంఠపురం’ మూవీలోని బుట్ట బొమ్మ పాటకు మనోడు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.

- Advertisement -

ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా వార్నర్ స్టెప్పులకు అభినందనలు తెలియజేస్తూ ఉంటాయి. ఈరోజు వార్నర్ పుట్టినరోజు కావడంతో పలువురు స్టార్ క్రికెటర్స్ బర్త్ డే విషెస్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా వార్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు ‘థాంక్యూ మై బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు వార్నర్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే వార్నర్.. తెలుగు సినిమాలో నటిస్తున్నట్టు ఇటీవల తరుచూ వార్తలు వస్తున్నాయి. అది ‘పుష్ప2’ మూవీనా లేదా వేరే సినిమానా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప2 మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. దీంతో ఈ సినిమాకు ఊహించని రీతిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News