Sunday, October 27, 2024
Homeచిత్ర ప్రభKomatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు

Komatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు

Komatireddy Venkat Reddy| తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telangana Film Chamber) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి కోమటిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించామని తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించిన ఆయన.. ప్రమాణ స్వీకార మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారన్నారు.

- Advertisement -

అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో 16,000 మంది సభ్యులు ఉన్నారని.. ఇందులో చాలా మంది సభ్యులకు నివాస స్థలాలు లేవని, ఇల్లు లేని సినీ కార్మికులకు ఇల్లు మంజూరు చేయించాలని మంత్రిని కోరడం జరిగిందని చెప్పుకొచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన కోమటిరెడ్డి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మంత్రి కలిసిన వారిలో హీరో కిరణ్, జేవియర్, స్నిగ్ధ రెడ్డి, అక్సా ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేష్ నాయుడు, కాచం సత్యనారాయణ, అశోక్ కుమార్, నరసింహారావు, శ్రీనివాస్ గౌడ్, అల్లా బక్ష వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News