Monday, October 28, 2024
HomeతెలంగాణHarish Rao: 10 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్ చేయడంపై హరీష్‌రావు ఆగ్రహం

Harish Rao: 10 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్ చేయడంపై హరీష్‌రావు ఆగ్రహం

Harish Rao| ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుళ్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలు ఉధృతం అవ్వడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

“ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.”నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెలుసు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.? వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని వెల్లడించారు.

కాగా కొన్నిరోజులుగా తమతో వెట్టిచాకరీ ఆరోపణలు చేయిస్తున్నారంటూ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు, భార్యలు రోడ్కడెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు రోజురోజుకు ఉధృతం కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే 10 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్‌లో కానిస్టేబుల్ జి.రవికుమార్, భద్రాద్రి కొత్తగూడంలోని ఆరో బెటాలి యన్ కానిస్టేబుల్ కె.భూషణావు, అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ వి.రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్.కె.షఫీ, సిరిసిల్లలోని 17వ బెటా లియన్లో ఏఆర్ ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌ రెడ్డి, టి.వంశీ, బిఆశోక్, ఆర్ శ్రీనివాస్‌లను విధుల నుంచి తొలిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News