Monday, October 28, 2024
Homeఆంధ్రప్రదేశ్AP High Court: ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

AP High Court: ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

AP High Court| ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్ (CJ Dheeraj Singh Thakur) అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్‌, జస్టిస్ చల్లా గుణరంజన్‌లు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ముగ్గురి న్యాయమూర్తుల నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. అయితే ఇంకా ఖాళీగా ఉన్న మరో 8 పోస్టులను త్వరలో భర్తీ చేయాల్సి ఉంది.

- Advertisement -

కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ నేతృత్వంలోని కొలీజియం.. మే15వ తేదీన మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌, ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజా­బాబు, గేదెల తుహిన్‌ కుమార్‌ పేర్లను అదనపు న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేస్తూ కేంద్రానికి పంపింది. ఈ సిఫారసులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించింది. అనంతరం వీరిలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణరంజన్ పేర్లకు ఆమోదముద్ర వేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వీరి నియామకం అధికారికంగా జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News