Telangana TDP| ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ పాగా వేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలంగాణ పార్టీ నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తానని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంలోనూ టీడీపీ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దూకుడు పెంచారు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మినహా రాష్ట్రంలోని మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు. ఈమేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు(Bakkani Narasimhulu) అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఖమ్మం-వాసరెడ్డి రఘునాథం,
మహబూబాబాద్- కొండపల్లి రామ్ చందర్ రావు,
భువనగిరి- కుందారపు కృష్ణాచారి
మల్కాజ్‌గిరి- కందికంటి అశోక్ కుమార్ గౌడ్,
సికింద్రాబాద్- పిన్నమనేని సాయిబాబా
నాగర్‌కర్నూలు- బి.రాములు
జహీరాబాద్- పైడి గోపాల్ రెడ్డి
మెదక్- ఇల్లెందు రమేశ్
నిజామాబాద్- యాదాగౌడ్
ఆదిలాబాద్- గుళ్లపల్లి ఆనంద్
నల్లగొండ- కసిరెడ్డి శేఖర్ రెడ్డి
పెద్దపల్లి- సంజయ్
కరీంనగర్- వంచె శ్రీనివాస్ రెడ్డి
చేవెళ్ల- కట్టా వెంకటేశ్ గౌడ్
వరంగల్- అర్షనపల్లి విద్యాసాగర్ రావు
మహబూబ్‌నగర్- వెంకటేశ్వర రెడ్డిలను కన్వీనర్లుగా నియమించారు.