Monday, October 28, 2024
HomeతెలంగాణShabbir Ali: రేవంత్ రెడ్డిని జైల్లో చంపాలని చూశారు.. షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు

Shabbir Ali: రేవంత్ రెడ్డిని జైల్లో చంపాలని చూశారు.. షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు

Shabbir Ali| జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse)లో జరిగిన ఘటనపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ముఖ్య నేత షబ్బీర్ అలీ(Mohammed Shabbir Ali) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్(KTR) బావమరిది రాజ్ పాకాల(Raj Pakala) ఫామ్‌హౌజ్‌లో దొరికిన లిక్కర్, డ్రగ్స్, అమ్మాయిలు, అబ్బాయిల వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. అసలు డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

కేటీఆర్‌ బావమరిది పేకాట ఆడుతూ డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికిపోయారంటూ ఆరోపించారు. అసలు ఈ పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో జన్వాడ ఫామ్‌హౌజ్‌పై వాస్తవాలు చూపించినందుకు గతంలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని 40 రోజులు జైల్లో పెట్టారని గుర్తుచేశారు. అప్పుడు జైల్లోనే రేవంత్‌ రెడ్డిని చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు.. ప్రతి వారం రాజ్ పాకాల రేవ్‌ పార్టీ(Rave party) నిర్వహిస్తున్నారని.. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు. త్వరలో వాస్తవాలను ప్రజలు ముందు పెడతామని తెలిపారు.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి(Yennam Srinivas Reddy) కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు చేసిన బామ్మర్దిని వెనుకేసుకొస్తే కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్‌కు సమాధి తప్పదని హెచ్చరించారు. పార్టీపై సమాచారం అందుకున్న అధికారులు దర్యాప్తు చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారుల ప్రమేయం ఎక్కడ ఉందన్నారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల డ్రగ్స్ ఇస్తేనే తాను డ్రగ్స్ తీసుకున్నానని విజయ్ మద్దూరు చెప్పారని.. ఇది చాలా తీవ్రమైన విషయం అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తమపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు విడ్డూరమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్, భూదాన్ భూముల స్కామ్‌లు త్వరలోనే బయటకు వస్తాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News