Monday, October 28, 2024
Homeతెలంగాణరెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు

రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు

70 మంది అధికారులకు స్దాన చలనం
మంత్రి పుట్టిన రోజునే ఉత్తర్వులు

- Advertisement -

హైదరాబాద్, అక్టోబర్ 28 (తెలుగు ప్రభ బ్యూరో) :
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు అక్టోబర్ 28న 70 మంది రెవెన్యూ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. . ఈ మేరకు సోమవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల రక్షణ వంటి అనేకాంశాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో 70 మంది డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీల గురించి ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ పలువురు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ వంటి శాఖల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవరూ ఊహించని రీతిలో వేర్వేరు స్థానాలకు ట్రాన్స్‪వర్లు జరగడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News