Sunday, November 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

Nara Lokesh: మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

Nara Lokesh met Satyanadella: ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెక్రోసాఫ్ట్(Microsoft) సీఈవో సత్య నాదెళ్ల(Satyanadella)తో సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి, ఏఐ యూనివర్సిటీ వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అలాగే రాజధాని అమరావతి(Amaravati)ని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఏపీని సందర్శించాలని నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ ఏపీని సాంకేతిక రంగంలో అగ్రగామిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్‌ పార్కులు నిర్మిస్తున్నాం. ఐటీ హబ్‌లను ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చదిద్దడంలో మైక్రోసాఫ్ట్‌ సహకారం అవసరం. ప్రపంచస్థాయి సంస్థలకు ఏపీ ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. క్లౌడ్‌ సేవల్లో మైక్రోసాఫ్ట్‌ నాయకత్వంతో కలిసి వెళ్లాలని.. అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నాం. అగ్రిటెక్‌కు ఏఐ అనుసంధానంతో రాష్ట్ర సాగురంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉత్పాదకతను పెంచే సాగు విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా అందుబాటులోకి మరిన్ని సేవలు తీసుకొస్తాం. వ్యాపార, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తయారుచేయాలని భావిస్తున్నాం. అక్కడ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణలకు ఏపీతో కలిసి పనిచేయండి’’ అని సత్య నాదెళ్లను కోరారు.

అలాగే శాన్‌ఫ్రాన్సిస్కోలో అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌తోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అనుకూలమని వివరించారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చిస్తామని..ఏపీలో పెట్టుబడుల అంశంపై పరిశీలిస్తామని శంతను నారాయణ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News