Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: జగన్ బెయిల్ రద్దుకు కుట్ర.. ఈ శతాబ్దపు జోక్: షర్మిల

YS Sharmila: జగన్ బెయిల్ రద్దుకు కుట్ర.. ఈ శతాబ్దపు జోక్: షర్మిల

YS Sharmila| వైసీపీ అధినేత జగన్‌ బెయిల్‌ రద్దుకు కుట్ర పన్నారంటూ దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ లేఖకు వైసీపీ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వైసీపీ రాసిన లేఖకు కౌంటర్‌గా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరో లేఖ విడుదల చేశారు.

- Advertisement -

‘‘ఈడీ అటాచ్‌ చేసింది షేర్లు కాదు.. రూ.32కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు. స్టేటస్‌కో ఉన్నది షేర్లపై కాదు. గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వాటికి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదు. ఈడీ అటాచ్‌ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదం. నాకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై జగన్‌ సంతకం చేశారు. బెయిల్‌ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?” అని షర్మిల ప్రశ్నించారు.

2021లో రూ.42 కోట్లకు క్లాసిక్‌ రియాలిటీ, సండూర్‌, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?బెయిల్‌ రద్దవుతుందని షేర్లు విక్రయించినప్పుడు తెలియదా?అలా అమ్మడం స్టేటస్‌ కోను ఉల్లంఘించినట్లు కాదా?షేర్ల బదిలీకి, బెయిల్‌ రద్దుకు సంబంధం లేదని మీకు తెలుసు. షేర్స్ ట్రాన్స్‌ఫర్‌కు, బెయిల్ రద్దుకు సంబధం లేదన్న విషయం తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఎన్సీఎల్‌టీ( NCLT)లో కేసు ఉంది కాబట్టే.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుంది.. కొడుకు (జగన్) బెయిల్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మకు తెలుసు. విజయమ్మ లేఖ నేను రాయకపోతే… ఆ లేఖతో సంబంధం లేదని, అది నేను రాయలేదని, స్వయంగా లేఖను ఖండించే వారు కదా” అని లేఖలో పేర్కొన్నారు.

మొత్తానికి వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదం డైలీ సీరియల్‌లా రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లేఖాస్త్రాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు కొనసాగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News